హోంమంత్రిపై తెలుగు హీరోయిన్ ఘాటు వ్యాఖ్యలు

గణపతి మండపాల్లో మైకు పర్మిషన్‌కు విగ్రహం ఎత్తును బట్టి చలాన్లు కట్టాలని ఏపీ హోం మంత్రి అనిత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి.

Update: 2024-09-08 03:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: గణపతి మండపాల్లో మైకు పర్మిషన్‌కు, విగ్రహం ఎత్తును బట్టి చలాన్లు కట్టాలని ఏపీ హోం మంత్రి అనిత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. దీనిపై గణేష్ మండపాల నిర్వహకులతోపాటు విపక్ష నేతలు సైతం రకరకాలుగా స్పందిస్తున్నారు. తాజాగా.. హోం మంత్రి అనిత వ్యాఖ్యలపై ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ మాధవీలత స్పందించారు. ‘తప్పును ఖండించి తీరుతా. నాకు పార్టీ కంటే దేశం, ధర్మం, ముఖ్యంగా హిందూ ధర్మం కీలకం. అందరూ హిందూ పండుగల మీద పడి ఏడుస్తున్నారు. ఎందుకో అర్థం కావడం లేదు. ఎందుకింత కడపు మంట అని ప్రశ్నించారు. ఇదే రూల్‌ను ముస్లింలకు, క్రిస్టియన్లకు పెడతారా? అని అడిగారు. నాకు ఏం మతం అంటే ద్వేషం లేదని.. హిందూ మతాన్ని కించపరుస్తుంటే మాత్రం ఊరుకోము. అడుక్కుంటే చిల్లర పడేస్తాం కానీ ఇలాంటి నిబంధనలు పెట్టడం సరికాదు’ అని మాధవీలత ఘాటు వ్యాఖ్యలు చేశారు.


Similar News