TDP-Janasena ఉమ్మడి పోరు షురూ.. గుంతల ఏపీకి దారేది?.. అంటూ నిరసనకు పిలుపు
తెలుగుదేశం, జనసేన పార్టీ ఉమ్మడి సారథ్యంలో గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది అంటూ నిరసన కార్యక్రమానికి ఆ పార్టీ నేతలు పిలుపునిచ్చారు....
దిశ, వెబ్ డెస్క్: తెలుగుదేశం, జనసేన పార్టీ ఉమ్మడి సారథ్యంలో గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది అంటూ నిరసన కార్యక్రమానికి ఆ పార్టీ నేతలు పిలుపు నిచ్చారు. రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై ఉమ్మడి పోరు ప్రారంభించారు. రోడ్ల అధ్వాన్న స్థితిని నిరసన వ్యక్తం చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ, జనసేన నేతలు ఆందోళనలు నిర్వహించనున్నారు. 2023 నవంబర్ 18, 19 తేదీల్లో టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలందరూ రోడ్ల మీద రావాలిని, ఎక్కడ గుంత కనిపిస్తే అక్కడ సెల్ఫీ దిగి ఆ ఫోటోలను, వీడియోలను #GunthalaRajyamAP, #WhyAPHatesJagan హ్యాష్ ట్యాగ్‌లతో సోషల్ మీడియాలో షేర్ చేయాలని, పాలకుల కళ్ళు తెరిపించాలని ఆ పార్టీల నాయకులు పిలుపునిచ్చారు. ‘‘ఏపీకి ఇతర రాష్ట్రాల వాళ్ళు పెట్టిన పేరు 'గుంతల ఆంధ్రప్రదేశ్'. కానీ కళ్ళకు గంతలు కట్టుకున్న వైసీపీ పాలకులకు రోడ్లపై గుంతలు కనిపించడం లేదు. అందుకే తెలుగుదేశం, జనసేన పార్టీలు ఉమ్మడిగా "గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది.’’ అంటూ నిరసన వ్యక్తం చేయనున్నారు.