Viveka Case: వైఎస్ సునీతపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం.. సీరియస్ వార్నింగ్

వైఎస్ సునీతపై తెలంగాణ హైకోర్టు జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు లిమిట్స్ ఉండాలని హెచ్చరించారు..

Update: 2023-05-26 11:30 GMT

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ సునీతపై తెలంగాణ హైకోర్టు జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు లిమిట్స్ ఉండాలని హెచ్చరించారు. ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. అవినాశ్ రెడ్డి తరపు లాయర్లు, వైఎస్ సునీత న్యాయవాదుల మధ్య వాదోపవాదనలు సాగుతున్నాయి. అయితే అందరి వాదనల ఈ రోజే వింటామని జడ్జి సూచించారు. అవినాశ్ రెడ్డి లాయర్‌కు ఎంత సమయం ఇచ్చారో తమకు అంతే సమయం ఇవ్వాలని వైఎస్ సునీత కోరారు. దీంతో జడ్జి సీరియస్ అయ్యారు. వైఎస్ సునీత మధ్యలో కలుగజేసుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు ఈ ఉదయం పదిన్నరకు మొదలైన వాదనలు లంచ్ విరామం తర్వాత కూడా జరుగుతున్నాయి. సిట్ పోలీసులకు వాచ్‌మెన్ రంగన్న ఇచ్చిన స్టేట్‌మెంట్ చాలా కీలకమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు వాచ్ మెన్ రంగన్న స్టేట్ మెంట్‌లో ఏం చెప్పాడో వాటిని ప్రొడ్యూస్ చేయాలని కోర్టు తెలిపింది. అటు అవినాశ్ రెడ్డి తరపు లాయర్లు వాదనలు వినిపిస్తూ కీలక సాక్షి రంగన్న స్టేట్ మెంట్ పట్టించుకోకుండా సీబీఐ వదిలేసిందని తెలిపారు. 

ఇవి కూడా చదవండి:

అవినాశ్‌రెడ్డిని దోషిగా చిత్రీకరిస్తున్నారు.. అన్యాయం: K.A. Paul

Viveka Case: వైఎస్ భాస్కర్ రెడ్డికి అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు

వైఎస్ వివేకా హత్యకేసులో ట్విస్ట్.. ఎర్ర గంగిరెడ్డికి సుప్రీం కోర్టు షాక్ 

Tags:    

Similar News