బ్రేకింగ్: MP అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్
వైసీపీ నేత, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది.
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ నేత, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ తనపై కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేంది. అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిపై సీబీఐ కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించేందుకు హైకోర్టు నిరాకరించింది.
సీబీఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దంటూ తాము చెప్పలేమంటూ కోర్టు పేర్కొంది. సీబీఐ కోర్టుకు సమర్పించిన ఆధారాలన్నింటినీ హైకోర్టు తిరిగి సీబీఐకి అప్పగించింది. అవినాష్ రెడ్డి తదుపరి విచారణపై స్టే ఇవ్వలేమని.. అతడిని సీబీఐ విచారించుకోవచ్చని హైకోర్టు తీర్పిచ్చింది. విచారణ సమయంలో ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని సీబీఐను న్యాయస్థానం ఆదేశించింది. అంతేకాకుండా అవినాష్ రెడ్డి విచారణ ప్రాంతానికి న్యాయవాదిని అనుమతించలేమని తీర్పు వెలువరించింది.
ఇవి కూడా చదవండి: