టీడీపీ విరాళాలాల వివరాలిస్తాం.. మరి వైసీపీ సంగతేంటి: టీడీపీ నేత బొండా ఉమా

తెలుగుదేశం పార్టీకి ప్రజలిచ్చిన సొమ్ముని అవినీతిసొమ్ముగా చూపే దుస్థితికి జగన్ రెడ్డి..అతని జేబుసంస్థ సీఐడీ దిగజారాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా మహేశ్వరరావు అన్నారు.

Update: 2023-11-17 09:58 GMT

దిశ , డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీకి ప్రజలిచ్చిన సొమ్ముని అవినీతిసొమ్ముగా చూపే దుస్థితికి జగన్ రెడ్డి..అతని జేబుసంస్థ సీఐడీ దిగజారాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా మహేశ్వరరావు అన్నారు. నాలుగున్నరేళ్లుగా స్కిల్ డెవలప్ మెంట్ కేసుని విచారిస్తున్న సీఐడీ చివరకు ఏమీ తేల్చలేక విరాళాలసొమ్ములో బొక్కలు వెతికే పనిలో పడింది అని విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బొండా ఉమా మహేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. పార్టీకి వచ్చే విరాళాల వివరాలు ఇవ్వాలని టీడీపీ కార్యాలయానికి నోటీసులిచ్చినట్టే.. వివిధమార్గాల్లో వైసీపీకి వస్తున్న డబ్బువివరాలు ఇవ్వాలని అడిగే ధైర్యం సీఐడీకి ఉందా? అని బొండా ఉమా మహేశ్వరరావు నిలదీశారు. జగన్ రెడ్డి దేశంలోనే ధనికుడైన ముఖ్యమంత్రిగా ఎలా నిలిచాడో నిజాలు నిగ్గుతేల్చి ప్రజల ముందు వాస్తవాలు ఉంచే ధైర్యం సీఐడీకి ఉందా? అని సవాల్ విసిరారు. సీఎం వైఎస్ జగన్ తన అవినీతి పత్రిక తప్పుడు రాతలతో ప్రజలపక్షాన పోరాడే ప్రతిపక్షనేతల్ని తప్పుడు మనుషులుగా చిత్రీకరిస్తోందని ఆరోపించారు. ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పి నిజం చేయాలనే జగన్ రెడ్డి, వైసీపీ ఆలోచనా విధానాన్ని సొంత మీడియా తూచా తప్పకుండా పాటిస్తోందన్నారు. మరోపక్క సీఐడీ విభాగం జగన్ రాజకీయ కక్షసాధిం పుల కోసం పనిచేసే సంస్థగా దిగజారిపోయిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ‘సీఐడీ విభాగం మొన్ననే టీడీపీ జాతీయ కార్యాలయానికి నోటీసులు పంపింది. ఆ నోటీసుల్లో సీఐడీ తమకు సంబంధంలేని, తాము అడగకూడని వివరాలు అడి గింది. తెలుగుదేశం పార్టీకి వచ్చే విరాళాల వివరాలు.. ఆదాయ వ్యయాలకు సంబంధించిన సమాచారాన్ని నిబంధనల ప్రకారం ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ కు అందిస్తోంది. తమ పార్టీ ఎన్నికల కమిషన్ కు ఇచ్చే వివరాలు.. వాస్తవాలు కళ్లముందు కనిపిస్తున్నా కూడా జగన్ రెడ్డి అవినీతి పత్రిక కావాలనే తెలుగుదేశంపై బురదజల్లుతోంది అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా మహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్‌ది శునకానందం

వైసీపీ అధికారంలోకి వచ్చాక అధికారులతో సమావేశమై..చంద్రబాబు ను జైలుకు పంపాలని... అతని అవినీతిని నిరూపిస్తే బహుమతులిస్తానని సీఎం వైఎస్ జగన్ వారిని ప్రలోభపెట్టాడు అని బొండా ఉమా మహేశ్వరరావు ఆరోపించారు. ఈ విధంగా ఎన్ని కుటిల రాజకీయాలు చేసినా నాలుగేళ్లలో ఏమీ నిరూపించలేకపోయాడు.. చంద్రబాబు తప్పు చేశాడని తేల్చలేక పోయాడన్నారు. చివరకు తాను జైలుకెళ్లాడు కాబట్టి ఏదోరకంగా చంద్రబాబుని జైలుకు పంపాలన్న దుగ్థతో ఆయనపై తప్పుడు కేసులు పెట్టి 52 రోజులు జైల్లో పెట్టి, తన శునకానందం తీర్చుకున్నాడు అని ధ్వజమెత్తారు. చంద్రబాబు పైసా అవినీతికి పాల్పడలేదని తెలియడంతో చివరకు తెలుగుదేశం పార్టీకి ప్రజల నుంచి వచ్చే విరాళాలసొమ్ము ని అవినీతి సొమ్ముగా చూపేందుకు పడరాని పాట్లు పడుతున్నాడు అని బొండా ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు.


జగన్ రెడ్డిలా లక్షల కోట్లు విదేశాల్లోకి తరలించలేదు

జగన్ రెడ్డి లాగా ప్రజల సొమ్ము కొట్టేసి, హావాలా ద్వారా విదేశాలకు తరలించి, ఈడీ సీబీఐ కేసుల్లో ఇరుక్కొని జైలుకెళ్లిన చరిత్ర తమ పార్టీ అధినేత చంద్రబాబుకు లేదని బొండా ఉమా చెప్పుకొచ్చారు. అనంతరం బెయిల్‌ పై బయటకు వచ్చి జనాల్ని వంచించి అధికారంలోకి వచ్చి.. మరలా లక్షలకోట్లు కొట్టేసే దుర్మార్గపు ఆలోచనలు టీడీపీ చేయదు అని బొండా ఉమా చెప్పుకొచ్చారు. వైసీపీకి వేలకోట్లు చందాల రూపంలో ఎటునుంచి వచ్చాయో.. ఎలా వచ్చాయో జగన్ రెడ్డి చెప్పగలడా? అని నిలదీశారు. తెలుగుదేశం పార్టీకి రూ.27కోట్లు తప్పుడు మార్గంలో వచ్చాయని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా న్యాయస్థానాల్లో తప్పుడు ప్రచారం చేశాడని మండిపడ్డారు. వైసీపీ నుంచి సాక్షి సంస్థకు వెళ్లిన రూ.150కోట్ల సంగతేమిటి? అని బొండా ఉమా నిలదీశారు. చంద్రబాబుకి.. టీడీపీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చినట్టే సీఐడీ వైసీపీ ఆఫీసుకి.. జగన్‌రెడ్డికి నోటీసులివ్వగలదా? అంతధైర్యం సీఐడీ విభాగానికి ఉందా? అని ఛాలెంజ్ చేశారు. దేశంలోనే అత్యంత ధన వంతుడైన సీఎంగా జగన్ రెడ్డి ఎలా నిలిచాడో సీఐడీ నిగ్గు తేల్చగలదా? పోనీ ఏ వ్యాపారాలు చేసి..ఎన్ని ఎకరాలు పండించి తాను ధనికుడైన సీఎంగా నిలిచాడో జగన్ రెడ్డి చెప్పగలడా? అని ప్రశ్నించారు. వైసీపీకి వస్తున్న విరాళాలు.. జగన్ రెడ్డి దేశంలోనే ధని కుడైన సీఎంగా ఎదిగిన తీరుపై ఎన్నికల కమిషన్ కూడా దృష్టిపెట్టాలి అని సూచించారు. స్కిల్ డెవ లప్ మెంట్ కేసులో ఏమీ లేదు కాబట్టే.. జగన్ రెడ్డి, అతని అవినీతి మీడియా ఇప్పటికీ విషప్రచారంతో తెలుగుదేశంపై బురదజల్లుతోందన్నారు. తెలుగుదేశం పార్టీ బాధ్యతగల రాజకీయ పార్టీగా ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్‌కు.. ఇన్ కంటాక్స్‌కు వివరాలు సమర్పిస్తోంది. తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొని పిచ్చికూతలు కూసే గొట్టం గాళ్లకు.. అవినీతి పత్రికకు సమాధానం చెప్పాల్సిన అవసరం తమకు, తమపార్టీకి లేదు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా మహేశ్వరరావు స్పష్టం చేశారు.

Tags:    

Similar News