టెక్కలి గెలుపుపై అచ్చెన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు

సీఎం జగన్‌పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ..

Update: 2024-02-11 14:17 GMT

దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్‌పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం రూ. 11 లక్షల కోట్లు అప్పు తెచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో రోజు రోజుకు వైసీపీ నేతల దోపిడీలు పెచ్చుమీరుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలోనే కాదని.. ఇతర రాష్ట్రాలలోనూ జగన్ పాలనను విమర్శిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలు చీ అని అసహ్యించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో టెక్కలిలో తెలుగుదేశం పార్టీ 50 వేల మెజార్టీతో బంపర్ విక్టరీ సాధిస్తుందని జోస్యం చెప్పారు. తాము అధికారంలోకి వస్తే టెక్కలికి అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. టెక్కలి నియోజక వర్గాన్ని జిల్లా కేంద్రంగా చేస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ హయాంలో వంశధార ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశామన్నారు. తమ కార్యకర్తలపై దాడి చేసిన వైసీపీ శ్రేణులను అసలు వదిలిపెట్టమని.. చక్రవడ్డీతో కలిపి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.  


Similar News