ఆ వీడియోలను ఫోరెన్సిన్ ల్యాబ్‌కు పంపుతాం: ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా సంచలన వ్యాఖ్యలు
టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం సస్పెన్షన్‌పై ఆ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు...
దిశ, వెబ్ డెస్క్: సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం (Mla Adimulam) రాసలీలల వీడియో రాష్ట్రంలో వైరల్ అయిన విషయం తెలిసిందే. తనను ఎమ్మెల్యే ఆదిమూలం లైంగికంగా వేధించారని బాధితురాలు ఆరోపించడంతో ఆయనపై తెలుగు దేశం పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. ఎమ్మెల్యే ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే ఎమ్మెల్యే సస్పెన్షన్‌పై ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ (Ap Tdp Chief Palla Srinivas) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదిమూలంకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యిందని, ప్రజల్లో చెడు అభిప్రాయం కలగకూడదని ఎమ్మెల్యేను సస్పెండ్ చేశామని చెప్పారు. అంతేకాదు ఆ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపుతామని తెలిపారు. నివేదిక తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎవరు తప్పు చేసినా కఠిన శిక్ష తప్పదని పల్లా శ్రీనివాస్ హెచ్చరించారు.