AP CIDపై Nara Lokesh సెటైర్లు.. కారణం జగనేనని మండిపాటు

జ‌గ‌న్ రెడ్డి పాల‌న‌లో సీఐడీ పేరు క్రైమ్ ఇన్‌వాల్వ్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌గా మార్చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. చివరికి సివిల్ కేసుల సెటిల్మెంట్లు, క‌బ్జాలకి సీఐడీని అడ్డా చేశారని మండిపడ్డారు...

Update: 2023-01-23 11:14 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: జ‌గ‌న్ రెడ్డి పాల‌న‌లో సీఐడీ పేరు క్రైమ్ ఇన్‌వాల్వ్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌గా మార్చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. చివరికి సివిల్ కేసుల సెటిల్మెంట్లు, క‌బ్జాలకి సీఐడీని అడ్డా చేశారని మండిపడ్డారు. సీఐడీ పేరు వింటేనే జనం ఛీకొట్టేలా తీరు ఉందని ధ్వజమెత్తారు. విశాఖ పాత మ‌ధుర‌వాడ‌లో కల్లుగీత కార్మికులపై ఎందుకు బెదిరింపులకు దిగారో సీఐడీ స‌మాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రూ.20 కోట్ల విలువైన స్థలాన్ని క‌బ్జా చేయ‌డానికి సీఐడీని గూండా గ్యాంగుల్లా వాడ‌టం సైకో పాల‌న‌లోనే చూస్తున్నామంటూ లోకేశ్ ట్విటర్ ద్వారా ఆగ్రహ వ్యక్తం చేశారు. పేద గీత‌కార్మికులపై ఖాకీకావ‌రం చూపుతోన్న సీఐడీకి ద‌మ్ముంటే ద‌స‌ప‌ల్లా భూములు క‌బ్జా చేసినోళ్లను పట్టుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సవాల్ విసిరారు.

ఇవి కూడా చదవండి : Ayyanna ఇంటి గోడ కూల్చివేతపై ప్రైవేటు కేసు

Tags:    

Similar News