‘అవసరమైతే అదానీ కాళ్లు పట్టుకుంటా’..టీడీపీ ఎమ్మెల్యే సెన్సేషనల్ కామెంట్స్!
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. దీంతో రాష్ట్రంలో సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు.
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. దీంతో రాష్ట్రంలో సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని పరిశ్రమలు తరలిపోయాయని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఏపీలో కృష్ణపట్నం కంటైనర్ పోర్టు గురించి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో రాష్ట్రం చాలా నష్టపోయింది అన్నారు. ఈ క్రమంలో కృష్ణపట్నం నుంచి కంటైనర్ పోర్టును తరలిపోనివ్వబోమని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కంటైనర్ పోర్టు తరలింపుతో పదివేల మంది ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఎన్డీయే కూటమి ఎంపీలతో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని..రైతులు, ఉద్యోగుల కోసం అవసరమైతే అదానీ కాళ్లు పట్టుకుంటానని ఆయన వ్యాఖ్యానించారు. కాగా కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించాలంటూ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.