AP Political News: పోలీసుల పై టీడీపీ నేత ఫైర్..
ఆంధ్రప్రదేశ్ లోని ప్రొద్దుటూరులో పోలీసుల పై టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని ప్రొద్దుటూరులో పోలీసుల పై టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కొందరు వ్యక్తులు బంగారం కొనేందుకు తమ వెంట తెచ్చుకున్న డబ్బులను సరైన బిల్లులు లేవని ప్రొద్దుటూరు పోలీసులు సీజ్ చేశారు. ఈ విషయం పైన స్పందించిన ప్రొద్దుటూరు టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారం కొనేందుకు ప్రజలు తమ వెంట తెచ్చుకున్న నగదుకు బిల్ లేదని సీజ్ చేయడం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే పోలీసులకు తనిఖీ చేయమని ఎవరు చెప్పారని ప్రశ్నించారు.
ఇదంతా వైసీపీ కుట్రని.. కేవలం వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకే పోలీసులు ప్రజల పైన విజృభిస్తున్నారని.. ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే ప్రజల డబ్బును , వ్యాపారుల డబ్బును పట్టుకుంటున్నారని ఆరోపించారు. గతంలో అక్రమంగా రవాణా చేస్తున్న 30 మద్యం సీసాలు సీజ్ చేస్తేనే ఎస్ఈబీ పీఎస్ కి వెళ్లి మరి పోలీసులను దుర్భాషలాడిన అధికార పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు.. అన్యాయంగా ప్రజల డబ్బు పట్టుకుంటే ఎందుకు స్టేషన్ కి వెళ్లి నిలదీయ్యలేదని ప్రశ్నించారు. దాన ధర్మాల పేరుతో ఎమ్మెల్యే రాచమల్లు కోట్ల రూపాయలను తరలిస్తున్నారని ఆరోపించిన ఆయన.. ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి వాహనాన్ని మాత్రం ఎందుకు తనికీ చెయ్యరని ప్రశించారు.
Read More..
కాంగ్రెస్‌లో చేరడానికి కారణం అదే.. అసలు విషయం బయటపెట్టిన YS షర్మిల