తునిలో ‘రా కదలిరా’ సభ.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. ..
దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో ‘రా కదిలిరా’ సభకు హాజరైన ఆయన ఇక జగన్ ఎప్పటికీ గెలవలేరని జోస్యం చెప్పారు. తుని నుంచే రాష్ట్ర రాజకీయం మారబోతోందన్నారు. టీడీపీ ప్రభంజనం సృష్టించబోతోందని, ఆ సునామీలో జగన్ ప్రభుత్వం కొట్టుకుపోతుందన్నారు. మరో మూడు నెలల్లో టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి రాబోతోందని చంద్రబాబు తెలిపారు. జగన్‌కు అహంకారం ఉందని, అదే వైసీపీ అంతానికి దారితీసే పరిస్థితికి తెచ్చిందని విమర్శించారు. జగన్ రాతియుగం పోయి.. టీడీపీ, జనసేన స్వర్ణయుగం రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అందుకోసం వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించాలని ఆయన పిలుపు నిచ్చారు. వచ్చే ఎన్నికలు సైకో జగన్‌కు, 5 కోట్ల మంది ప్రజలకు మధ్య జరగాలని సూచించారు. జగన్ పాలనలో ప్రజల జీవన శైలిలో మార్పులు వచ్చాయా అని ప్రశ్నించారు. కల్తీ మద్యంతో మహిళల తాళిబొట్లతో చెలగాటమాడారని మండిపడ్డారు. రాష్ట్రంలో టీడీపీతోనే సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని చంద్రబాబు గుర్తు చేశారు.