Home Minister Anitha:మాజీ మంత్రి అంబటి రాంబాబుకు హోం మంత్రి అనిత స్ట్రాంగ్ కౌంటర్
రాష్ట్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం పై మంగళవారం వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former minister Ambati Rambabu) సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
దిశ,వెబ్డెస్క్: రాష్ట్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం పై మంగళవారం వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former minister Ambati Rambabu) సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వాన్ని(Government) ప్రజలు కూకటివేళ్లతో పెకలించడం ఖాయమని అంబటి రాంబాబు(Ambati Rambabu) నిన్న మీడియాతో మాట్లాడారు. ఈ తరుణంలో రాష్ట్ర హోం మంత్రి పేరుకు.. మైకుల ముందు మాత్రమే మంత్రి అని పోలీసులను ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఆమెకు లేదని మాజీ మంత్రి అంబటి కామెంట్ చేశారు.
అయితే.. అంబటి రాంబాబు వ్యాఖ్యలపై నేడు(బుధవారం) రాష్ట్ర హోం మంత్రి అనిత(Home Minister Anitha) స్పందించారు. ఈ క్రమంలో అంబటి రాంబాబుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో హోం మంత్రి అనిత మాట్లాడుతూ.. ‘తాను మైక్ ముందు మాట్లాడే హోం మంత్రినే కాదని, స్త్రీ జాతిని అగౌరవపరుస్తూ మాట్లాడే వారిని లాఠీతో మక్కెలిరగ్గొట్టించే హోం మంత్రినని అంబటి రాంబాబుకి అనిత కౌంటర్ ఇచ్చారు. వావివరుసలు మరచి ఆంబోతుల్లా సోషల్ మీడియా(Social Media)లో విరుచుకుపడే విపరీతాలని గట్టిగా ఎదిరించే విపత్తు నిర్వహణ శాఖ(Disaster Management Department) మంత్రినని పేర్కొన్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ఉన్మాదం ప్రవర్తించే వారిని చట్టప్రకారం శిక్షించే హోంమంత్రినని’ ఆమె బదులిచ్చారు.