బాబాయ్‌ను గొడ్డలితో చంపిందెవరు..?

బాబాయ్‌ను గొడ్డలితో చంపిందెవరని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు...

Update: 2024-04-29 15:42 GMT

దిశ, వెబ్ డెస్క్: బాబాయ్‌ను గొడ్డలితో చంపిందెవరని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకా హత్యపై చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపించారు. హూ కిల్డ్ బాబాయ్ అని నిలదీశారు. బాబాయ్‌ను చంపి ఆయన కూతురు సునీతపైనే కేసు పెట్టిన ఘనత జగన్‌కే దక్కుందన్నారు.


న్యాయం చేయాలని సునీత అడిగితే కేసు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో సీఎం జగన్ ఆడిన కోడి డ్రామా ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. కోడికత్తి, గులకరాయితో హత్యా యత్నం తానే చేశానని జగన్ అన్నాడని గుర్తు చేశారు. చంపేది వాళ్లు.. నెపం నెట్టేది వేరే వాళ్లపైనా అని విమర్శించారు. జగన్ వృత్తి, ప్రవృత్తి కూడా అదేనని ఎద్దేవా చేశారు. జగన్ డ్రామాల రాయుడని, సానుభూతిరాయుడు అని చంద్రబాబు సెటైర్లు వేశారు.

Tags:    

Similar News