AP News:ధర్మవరం చెరువు నుంచి రావులచెరువుకి నీటిని విడుదల చేసిన టీడీపీ ఇంచార్జ్
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ధర్మవరం చెరువు మరవ పారిన విషయం విధితమే.
దిశ, ధర్మవరం రూరల్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ధర్మవరం చెరువు మరవ పారిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో ధర్మవరం చెరువు నుంచి రావులచెరువుకు నీరు ఇవ్వాలన్న సంకల్పంతో ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ రెండు జెసిబి లతో కాలువల్లో పూడిక తీయించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ధర్మవరం చెరువు ఏడవ తూము నుంచి రావులచెరువుకు నీటిని విడుదల చేశారు. ముందుగా గంగ పూజ చేసి నీరు విడుదల చేయడంతో రావులచెరువు పరిధిలోని 10 గ్రామాల్లో బోర్లు రీఛార్జ్ అవుతాయని హర్షం వ్యక్తం చేస్తూ పరిటాల శ్రీరామ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ.. రైతుల శ్రేయస్సు కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. నీరు వృధా కాకుండా ధర్మవరం చెరువు నుంచి రావులచెరువుకి నీటిని విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉందని శ్రీరామ్ అన్నారు. రైతులు మంచి దిగుబడులు సాధించి సుభిక్షంగా ఉండాలని గంగమ్మ తల్లిని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ మహేష్ చౌదరి, విజయ సారధి, చిగిచెర్ల రాఘవరెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్లు సుధాకర్ నాయుడు, విశ్వనాధ్, చంద్ర, ప్రసాద్, బొంత చిరంజీవి, చిరంజీవి నాయక్, పవన్ కుమార్, అప్ప స్వామి నాయక్ తదితరులు పాల్గొన్నారు.