Breaking: వల్లభనేని ఇంటి వద్ద ఉద్రిక్తత.. అడిషినల్ డీసీపీ శ్రీహరిబాబు ఎన్నారంటే..!
వైసీపీ నేత వల్లభనేని వంశీ ఇంటి వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్తత పరిస్థితులపై టాస్క్ఫోర్స్ అడిషినల్ డీసీపీ శ్రీహరిబాబు స్పందించారు..
దిశ, వెబ్ డెస్క్: మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వంలో వల్లభనేని వంశీ, ఆయన అనుచరులు గన్నవరంలో అరాచకాలకు పాల్పడ్డారు. వీళ్ల అరాచకాలకు బలైన బాధితులు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వల్లభనేని వంశీ ఇంటి వద్దకు వెళ్లిన కొందరు యువకులు ఆయన ఇంటిపై రాళ్లు రువ్వారు. వల్లభనేని వంశీ బయటకు రావాలని డిమాండ్ చేశారు. ఆ ఆందోళనలతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలీసులు రంగం ప్రవేశం చేసి యువకులను చెదరగొట్టారు. పరిస్థితిని అదుపు చేశారు. ప్రస్తుతం వల్లభనేని ఇంటి వద్ద ప్రశాంత వాతావరణ నెలకొంది.
అయితే ఈ ఘటనపై టాస్క్ఫోర్స్ అడిషినల్ డీసీపీ శ్రీహరిబాబు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఇంటి వద్ద పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు ఆయన తెలిపారు. యువకులు చేసిన దాడిలో పోలీస్ వాహనం సైతం ధ్వంసం అయిందన్నారు. కొందరు యువకులను గుర్తించామని, దాడుల్లో 40 మంది ఉన్నట్లుగా ఆధారాలు లభించాయని తెలిపారు. వాటి ఆధారంగా చర్యలు తీసుకుంటామని శ్రీహరిబాబు పేర్కొన్నారు.