'వెయిట్ అండ్ సీ' ..పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తమిళనాడు డిప్యూటీ సీఎం స్పందన

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నిన్న తిరుపతిలో జరిగిన వారాహి సభలో సనాతన ధర్మం(Sanatana Dharma) గురించి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Update: 2024-10-04 08:54 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నిన్న తిరుపతిలో జరిగిన వారాహి సభలో సనాతన ధర్మం(Sanatana Dharma) గురించి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సనాతన ధర్మాన్ని అవహేళన చేసిన వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘‘సనాతన ధర్మాన్ని ఎవరూ నిర్మూలించలేరని.. అలా ఎవరైనా ప్రయత్నిస్తే మీరే కొట్టుకుపోతారన్నారు. తాను సనాతన హిందువునని, మీలాంటి వ్యక్తులు రావచ్చు పోవచ్చు కానీ సనాతన ధర్మం ఎప్పటికీ నిలిచి ఉంటుంది’’ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ అని, దానిని నిర్మూలిస్తామని కొందరు అంటున్నారు. అని పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆయన ఉదయనిధి పేరు ప్రస్తావించనప్పటికీ తమళనాట దీనిపై చర్చ మొదలైంది. అయితే ఈ వ్యాఖ్యలపై తాజాగా తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) స్పందించారు. ఆయన కారు ఎక్కేందుకు వెళ్తుండగా మీడియా ప్రతినిధులు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలపై ప్రశ్నించారు. దీంతో ఆయన స్పందిస్తూ.. 'వెయిట్ అండ్ సీ'(Wait and see) అని సమాధానం ఇచ్చారు. సనాతన ధర్మం (Sanatana Dharma) పై ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News