సూట్‌కేస్ తీసుకో..లోకేశ్‌తో కలిసిపో: పవన్-లోకేశ్ భేటీపై మంత్రి అంబటి సెటైర్లు
జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లు రాజమహేంద్రవరంలో కలిసిన సంగతి తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో : సూట్‌కేస్ తీసుకో..లోకేశ్‌తో కలిసిపో: పవన్-లోకేశ్‌భేటీపై మంత్రి అంబటి సెటైర్లుజనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లు రాజమహేంద్రవరంలో కలిసిన సంగతి తెలిసిందే. ఇరు పార్టీల మధ్య పొత్తు ప్రకటన అనంతరం ఇరు పార్టీల సమన్వయ కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాధన కోసం పోరాటం చేయాలని నిర్ణయించారు. కామన్ మినిమమ్ ప్రోగ్రాం గురించి చర్చించారు. అయితే ఈ సమన్వయ కమిటీ భేటీలో పవన్ కల్యాణ్, నారా లోకేశ్ కలిసిన ఫోటోలపై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. నారా లోకేశ్, పవన్ కల్యాణ్‌లను ఉద్దేశించి తనదైన శైలిలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నారా లోకేశ్ సొంతకుమారుడు అయితే పవన్ కల్యాణ్ అద్దెకుమారుడు అంటూ అభివర్ణించారు. ఇద్దరూ ఉత్తరకుమారులేనని విమర్శలు చేశారు. మరోవైపు సూట్ కేసు తీసుకో, లోకేశ్‌తో కలిసిపో అంటూ తనదైన సైలిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌లు కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్న ఫోటోలను అంబటి రాంబాబు షేర్ చేశారు. అలాగే తన ట్వీట్స్‌ను పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌లకు ట్యాగ్ చేశారు. పవన్ కల్యాణ్, నారా లోకేశ్ పేరు ఎత్తినా.. ప్రెస్‌మీట్లు పెట్టినా అంబటి రాంబాబు అటు సోషల్ మీడియాలోనూ ఇటు ప్రెస్మీట్లు పెట్టి మరీ విరుచుకుపడతారు. తాజాగా టీడీపీ, జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశంపైనా తీవ్ర సెటైర్లు వేశారు. మరి అంబటి రాంబాబు విమర్శలపై అటు టీడీపీ ఇటు వైసీపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.