దిశ, ఏపీ బ్యూరో : హెచ్ఆర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ పరిసరాల్లో ఉన్న హెచ్ఓడి కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులందరికీ హెచ్ఆర్‌ఏ పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 8 శాతం ఉన్న హెచ్‌ఆర్‌ఏను 16 శాతంకు పెంచుతూ ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ పెంపు హైదరాబాద్ నుంచి విజయవాడ పరిసరాలకు గతంలో వచ్చిన హెచ్ఓడి లకు వర్తించనుంది. హెచ్ఓడి అధికారుల సిఫార్సుల మేరకు ప్రభుత్వం హెచ్ఆర్ఏ ను సవరించినట్లు తెలుస్తోంది.
ఉద్యోగుల జీతాలు చెల్లింపునకు ఆటంకం కలిగించిన వారిపై చర్యలు
రాష్ట్రంలో పనిచేస్తున్న ట్రెజరీ ఉద్యోగులకు శనివారం ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే ఉద్యోగుల జీతాలు ప్రాసెస్ చేయాలని ఆదేశించింది. బిల్లులు ప్రాసెస్ చేయకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ హెచ్చరించారు. అంతేకాదు ఉద్యోగుల జీతాలు చెల్లింపునకు ఆటంకం కలిగించిన వారిపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు రావత్ ఉత్తర్వులు జారీ చేశారు.
కొత్త పీఆర్‌సీ ప్రకారం జీతాల బిల్లులు సిద్ధం చేయాలని చెప్పినా.. అధికారులు నిర్లక్ష్యం వీడకపోవడం సీసీఏ రూల్స్‌కు విరుద్ధమని స్పష్టం చేశారు. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై వారిపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు ఉద్యోగుల జీతాల చెల్లింపు ప్రక్రియకు సిబ్బంది సహకరించకపోతే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చేపట్టాలని ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ ఆదేశాలు జారీ చేశారు.