Viveka Murder Case: సీబీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం
వివేకా హత్య కేసులో నిందితుడు శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది..
దిశ, వెబ్ డెస్క్: వివేకా హత్య కేసులో నిందితుడు శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కేసు విచారణలో జాప్యం జరుగుతోందని..దర్యాప్తు అధికారి రామ్ సింగ్‌ను మార్చాలని ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తును ఎందుకు పూర్తి చేయడంలేదని ప్రశ్నించింది. విచారణ పురోగతి, తాజా పరిస్థితిపై సీల్డ్ కవర్‌లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
అయితే దర్యాప్తు అధికారి బాగానే విచారణ చేపడుతున్నారని అటు సీబీఐ కూడా సుప్రీంకోర్టుకు వివరించింది. విచారణ త్వరగా ముగించకపోతే మరో అధికారిని ఎందుకు నియమించకూడని సీబీఐని ధర్మాసనం ప్రశ్నించింది. దర్యాప్తు అధికారిగా మరొకరిని నియమించే అంశంపై సీబీఐ డైరెక్టర్ అభిప్రాయాన్ని తెలిపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
Read more: