రోజా వర్సెస్ సన్నీలియోన్.. నీలా కాదంటూ గట్టి కౌంటర్ ఇచ్చిన పోర్న్ స్టార్
ఎన్నికలకు ముందే ఏపీ రాజకీయం వేడెక్కింది. ఓ వైపు టీడీపీ నేత లోకేష్, మరోవైపు జనసేనా చీఫ్ పవన్ కల్యాణ్ యాత్రలు చేపట్టి వైఎస్ జగన్ సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలకు ముందే ఏపీ రాజకీయం వేడెక్కింది. ఓ వైపు టీడీపీ నేత లోకేష్, మరోవైపు జనసేనా చీఫ్ పవన్ కల్యాణ్ యాత్రలు చేపట్టి వైఎస్ జగన్ సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. తమకు మైలేజ్ ఇస్తుందనుకునే ప్రతి అంశాన్ని లేవనెత్తుతూ పొలిటికల్‌గా హీట్ పెంచే కామెంట్స్ చేస్తూ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. ఇంకోవైపు ప్రతిపక్షాల విమర్శలను, ఆరోపణలను అధికార పార్టీ మంత్రులు, నాయకులు ఎప్పటికప్పుడు తిప్పి కొడుతున్నారు. ఇదే సమయంలో ఆయా పార్టీలు సోషల్ మీడియా వేధికగా పోస్టులు పెడుతూ ఎండగట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఏపీ మంత్రి రోజాపై పోర్న్ స్టార్ సన్నీలియోన్ ఫైర్ అయిందంటూ ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇంతకూ దాని సారాంశం ఏంటంటే..?
జనసేన పార్టీ నేత పవన్ కల్యాణ్ తన వారాహి విజయ యాత్ర సమయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని విమర్శించారు. వైఎస్ భారతమ్మ.. నీ భర్తకు కాస్త సంస్కారం నేర్పించమ్మా లేదంటే.. నేను నేర్పిస్తారు అంటూ కామెంట్ చేశారు. దీనికి మంత్రి రోజా గట్టి కౌంటర్ ఇచ్చే క్రమంలో పవన్ కల్యాణ్ జగన్‌కు సంస్కారం నేర్పడమంటే సన్నీలియోన్ వేదాలు వల్లించినట్లుంది అంటూ ఆమె పేరు ప్రస్తావించింది. అయితే దీనిపై ఏకంగా పోర్న్ స్టార్ సన్నీలియోన్‌నే స్పందించిందంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. ఆమె ఫొటో, పేరుతోనే ఉన్న ఆ అకౌంట్ ఫేక్ అని తెలుస్తున్నప్పటికే వైసీపీ యాంటీ వర్గాలు దానిని వైరల్ చేస్తున్నాయి.
ఇంతకూ ఆ పోస్ట్‌లో ఏముందంట.. ‘‘నేను పోర్న్‌స్టార్‌ని.. నా గతం గురించి నాకు సున్నా పశ్చాత్తాపం లేదు. మీలా కాకుండా నేను చేయాలనుకున్నది బహిరంగంగానే చేశాను. నీకు నాకు తేడా ఒక్కటే, నేను ఇండస్ట్రీని వదిలేశాను, నువ్వు చేయలేదు’’ అంటూ రోజాకు కౌంటర్ ఇచ్చినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ నకిలీ సన్నీలియోన్ ట్వీట్ నెట్టింట హాట్ హాట్‌గా వైరల్ కావడంతో.. పవన్ అభిమానులు రోజాను ఓ రేంజ్లో ఆడేసుకుంటున్నారు. మరి ఈ వివాదం ఎంత వరకు వెళుతుందో చూడాలి.