Viveka Case: హైకోర్టుకు వేసవి సెలవులు.. అవినాశ్ రెడ్డి బెయిల్‌పై విచారణ వాయిదా
అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జూన్ 5 వరకు వాయిదా పడింది....
దిశ, వెబ్ డెస్క్: అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జూన్ 5 వరకు వాయిదా పడింది. మాజీ మంత్రి అవినాశ్ రెడ్డి హత్య కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తెలంగాణలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం.. విచారణను వాయిదా వేసింది. అయితే ఈ రోజే తీర్పు ఇవ్వాలని వైఎస్ సునీత తరపు లాయర్లు కోరడంతో న్యాయమూర్తి కుదరని తెలిపారు. శనివారం నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు కావడంతో వెకేషన్ బెంచ్‌కు మార్చుకుంటారా అని న్యాయమూర్తి అడిగారు. అర్జెన్సీ ఉందని ఇరుపక్షాలు వాదనలు తెలిపాయి. చీఫ్ జస్టిస్ ముందు మెన్షన్ చేయాలని న్యాయమూర్తి సూచించారు. ముందస్తు బెయిల్‌ను ఇన్ని రోజులు పెండింగ్‌లో పెట్టడం భావ్యం కాదని న్యాయమూర్తి పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని అవినాశ్ లాయర్లు చీఫ్ జస్టిస్ ముందు మెన్షన్ చేశారు.
ఇక తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. మే 1 నుంచి జూన్ 2 వరకు హైకోర్టు మూసివేయబడుతుంది. ప్రతి గురువారం మాత్రం అత్యవసర కేసుల విచారణ జరుగుతుంది. మే 4, 11, 18, 25, జూన్ 1 ప్రత్యేక కోర్టు నిర్వహిస్తారు.
Also Read..