ఎన్టీఆర్‌ను అవమానించడమంటే తెలుగు జాతిని అవమానించడమే: అచ్చెన్నాయుడు

తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకైన దివంగత సీఎం ఎన్టీఆర్‌ను అవమానించడ అంటే తెలుగుజాతిని అవమానించడమే.

Update: 2023-03-01 08:14 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ‘తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకైన దివంగత సీఎం ఎన్టీఆర్‌ను అవమానించడ అంటే తెలుగుజాతిని అవమానించడమే. పల్నాడు జిల్లా ఘంటా వారి పాలెం లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో జగన్ పాలనలో ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసం ఘటనలు వరుసగా జరుగుతున్న బాధ్యులపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు అని విమర్శించారు.

ఘంటావారిపాలెంలో వైసీపీ శ్రేణులే ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు అని ఆరోపించారు. జగన్ పాలనలో అసాంఘిక, అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయి అని మండిపడ్డారు. శాంతిభద్రతల నిర్వహణలో ఘోరంగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి అని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News