AP Rain Alert:బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. మూడు రోజులు భారీ వర్షాలు
రాష్ట్రాన్ని వర్షాలు(Rains) వీడడం లేదు.
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రాన్ని వర్షాలు(Rains) వీడడం లేదు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడినట్లు వాతావరణ శాఖ(Department of Meteorology) అధికారులు తెలిపారు. దీనివల్ల తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, యానాంలో మూడు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. బలపడిన అల్పపీడనం తమిళనాడు తీరం వైపు వెళ్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో(Andhra Pradesh) విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, విజయనగరం, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నాయి. రేపు(గురువారం) విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. అల్పపీడనం కారణంగా దక్షిణ కోస్తా తీరంలో గంటకు గరిష్ఠంగా 55 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో తూర్పు కోస్తా, దక్షిణ మధ్య రైల్వే తో పాటు అన్ని జిల్లాలకు అధికారులు హెచ్చరికలు చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచనలు జారీ చేశారు.