బ్రేకింగ్: ఆంధ్రప్రదేశ్‌లో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి..
ఆంధ్రప్రదేశ్‌లో వందేభారత్ ట్రైన్ పై రాళ్లదాడి జరిగింది.
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో వెర్షన్ 2 వందేభారత్ ట్రైన్‌పై రాళ్లదాడి జరిగింది. ట్రయల్ రన్లో భాగంగా వందేభారత్ ట్రైన్ చెన్నై నుండి ఆంధ్రప్రదేశ్ రాగా.. విశాఖలోని కంచరపాలెం రామ్మూర్తి పంతులు గేట్ వద్ద ఆగి ఉన్న రైలుపై గుర్తు తెలియని దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వందేభారత్ రైలు రెండు బోగీల అద్దాలు ధ్వంసమైనట్లు సమాచారం. వందే భారత్ ట్రైన్‌పై దాడి జరిగినట్లు వాల్తేరు డివిజన్ రైల్వే అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. కాగా, ఈ దాడిలో ధ్వంసమైన రైలును ఈ నెల19వ తేదీన ప్రధాని మోడీ ప్రారంభించాల్సి ఉండటం గమనార్హం. ఈ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.