సీఎం జగన్‌పై రాళ్ల దాడి.. సోదరి వైఎస్ షర్మిల ఎమోషనల్ ట్వీట్
ఏపీ సీఎం జగన్‌పై రాళ్ల దాడి జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం విజయవాడలో బస్సు యాత్ర చేస్తుండగా జగన్‌పై గుర్తు తెలియని
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్‌పై రాళ్ల దాడి జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం విజయవాడలో బస్సు యాత్ర చేస్తుండగా జగన్‌పై గుర్తు తెలియని దుండగులు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో సీఎం ఎడమ కంటికి గాయమైంది. ఈ క్రమంలో సోదరుడు, సీఎం జగన్‌పై దాడి ఘటనపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్టర్)లో ట్వీట్ చేశారు. ‘‘ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డిపై దాడి జరిగి ఎడమకంటి పైన గాయం కావటం బాధాకరం, దురదృష్టకరం. ఇది ప్రమాదవశాత్తు అయిందని అనుకుంటున్నాం. అలా కాకుండా, ఇది ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఖండించాల్సిందే. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. హింసను ప్రతి ప్రజాస్వామిక వాది ఖండించాల్సిందే. జగన్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను’’ అని షర్మిల ట్వీట్ చేశారు.