ప్రగతి పథంలో రాష్ట్రం.. మంత్రి రజని

విశాఖ నగరంలోని పోలీస్ బేరక్స్ గ్రౌండ్‌లో నిర్వహించిన 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా మంత్రి విడదల రజని పాల్గొని జాతీయ పతాకావిష్కరణ, జాతీయ గీతాలాపన చేశారు

Update: 2023-08-15 08:30 GMT

దిశ, ఉత్తరాంధ్ర: విశాఖ నగరంలోని పోలీస్ బేరక్స్ గ్రౌండ్‌లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా మంత్రి విడదల రజని పాల్గొని జాతీయ పతాకావిష్కరణ, జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లా కలెక్టర్ డా.ఎ. మల్లికార్జున, పోలీస్ కమిష్‌‌‌‌‌‌‌నర్ సి.ఎం. త్రివిక్రమ్ వర్మ జిల్లా ప్రగతి గురించి మాట్లాడారు. వేడుకల్లో పాల్గొన్న జి.వి.ఎం.సి.కమిష్‌‌‌‌‌నర్  సి.ఎం. సాయి కాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్, విశాఖ ఎం.పీ.ఎం.వీ.వి. సత్యనారాయణ, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, వంశీకృష్ణ యాదవ్, గ్రంధాలయ సంస్థ చైర్‌పర్సన్ కొండా రమాదేవి తదితరులు పాల్గొన్నారు.



Similar News