Nellore: తల ప్రాణం తోకకు వచ్చినంత పనైందా.. !
బలిజ భవన్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా మంత్రి అంబటి రాంబాబు విచ్చేశారు. ...
దిశ, నెల్లూరు సిటీ: బలిజ భవన్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా మంత్రి అంబటి రాంబాబు విచ్చేశారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు. బలిజలు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవాలని, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం మరొకరిని సీఎం చేసేందుకు కష్టపడుతున్నారంటూ వ్యంగ్యంగా విమర్శించారు. దాంతో ఈ కార్యక్రమానికి విచ్చేసిన బలిజ సామాజిక వర్గం ప్రజలు, పలు కాపు సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బలిజ భవన్ బయట అంబటి వ్యాఖ్యలకు నిరసన తెలిపారు. బలిజలంతా పవన్ కళ్యాణ్ వెనక అంటూ వారు నినాదాలు చేశారు. వారిని సర్ది చెప్పటానికి వైసీపీ బలిజ సంఘం నాయకులకు తల ప్రాణం తోకకు వచ్చినంత పనైంది.