మాజీ మంత్రి నారాయణకు షాక్.. అల్లుడు పునీత్‌పై కేసు
మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్‌పై పోలీసులు పన్ను ఎగవేత కేసు నమోదు చేశారు. ..
దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్‌పై పోలీసులు పన్ను ఎగవేత కేసు నమోదు చేశారు. తప్పుడు పత్రాలతో రూ.10 కోట్లు పన్ను వేగవేశారని నిర్ధారించారు. విచారణను మరింత ముమ్మరంగా చేశారు. ఇందులో భాగంగా సోమవారం నెల్లూరులో పునీత్ నివాసంతో పాటు కార్యాలయాల్లోనూ పోలీసులు సోదాలు చేశారు. పత్రాలు లేని రూ. కోటి 80 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
కాగా ఇన్స్‌పైర్ పేరుతో పునీత్ స్కూలు బస్సులు లీజుకుని తీసుకున్నారని పోలీసులు గుర్తించారు. ట్యాక్స్‌ను క్లెయిమ్ చేసుకోవడానికి విద్యాసంస్థల పేరుతో రిజిస్ట్రేషన్ చేశారని నిర్ధారించారు. నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీకి ఇన్స్ పైర్ అనే అనుబంధ సంస్థను ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు విచారణను ముమ్మరం చేశారు.