Nellore Districtలో మొదలైన ఎన్నికల కోడ్
ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ( మోడల్ కోడ్ ఆఫ్ కాండక్టు) అమల్లోకి వచ్చిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కేవీఎన్ చక్రధరబాబు పేర్కొన్నారు. ..
- ఈ నెల 16న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్
- 23న నామినేషన్లు దాఖలుకు చివరి తేదీ
- మార్చి 13న ఎన్నికలు..
- 6న లెక్కింపు, ఫలితాలు విడుదల
దిశ, నెల్లూరు: ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ( మోడల్ కోడ్ ఆఫ్ కాండక్టు) అమల్లోకి వచ్చిందని జిల్లా కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి కేవీఎ న్ చక్రధరబాబు పేర్కొన్నారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఉన్న యండవల్లి శ్రీనివాసులు రెడ్డి, ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం పదవీ కాలం ముగుస్తుండడంతో ఆ రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. భారత ఎన్నికల సంఘం ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసిందన్న కలెక్టర్.. ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 16న విడుదల అవుతుందని, నామినేషన్లు స్వీకరణకు చివరి తేదీగా ఈ నెల 23గా ఆయన పేర్కొన్నారు. ఇక ఎన్నికలు మార్చి 13న, ఓట్ల లెక్కింపు మార్చి 16న జరుగుందున్న చక్రధరబాబు .. అప్పటి వరకు జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుందని తెలిపారు.