Chandrababu Kavali Sabha: జగన్‌ను నమ్మి మళ్లీ మోసపోవద్దు

ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. సైకో పాలనతో రాష్ట్రం సర్వనాశనం అయిందని మండిపడ్డారు...

Update: 2022-12-29 17:05 GMT

దిశ, నెల్లూరు: ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. సైకో పాలనతో రాష్ట్రం సర్వనాశనం అయిందని మండిపడ్డారు. గురువారం కావలిలో చంద్రబాబు పర్యటించారు. కందుకూరు మృతుల ఆత్మశాంతి కోసం చంద్రబాబు 2 నిమిషాల మౌనం పాటించారు. కందుకూరులో జరిగిన ఘటన బాధకరమన్నారు. చనిపోయిన మృతుల కుటుంబాలకు 24 లక్షలు ఆర్థిక సాయం చేస్తామని, వారి పిల్లలను కూడా చదివించడం జరుగుతుందన్నారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతల వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తమ పార్టీలో నేతలేవరైనా తప్పుచేసిన వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. వైసీపీ నేతలు సైకో దగ్గర పని చేస్తున్నారన్నారు. ఓ సైకో చెప్పాడని పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

అక్రమ మద్యం సంపాదన తాడేపల్లికి...

జగన్ జేబ్రాండ్ ఆదాయం అంతా తాడేపల్లి ప్యాలెస్‌కి వెళ్తోందని విమర్శించారు. దేశంలోని అందరి సీఎంల కంటే జగన్ ఎక్కువ సంపాదన ఉందని కొన్ని సర్యేలు కూడా చెప్పాయన్నారు. కల్తీ మద్యం తాగి ఎందురో బలైపోతున్నారని తెలిపారు. ఎక్కడా లేని మద్యం బ్రాండ్‌లు మన రాష్ట్రంలోనే ఉన్నాయన్నారు. జేబ్రాండ్‌తో నకిలీ మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నారని విమర్శించారు. వాటి నుంచి వచ్చే ఆదాయం వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక చెన్నై బెంగుళూరు, హైదరాబాద్ వంటి ఇతర రాష్ట్ర్రాలకు తరలిపోతుందన్నారు.

నేను తలచుకుంటే జగన్ యాత్ర చేయగలిగే వారా?

కేసులు పెట్టి పోలీసులు టీడీపీ నేతలను టార్గెట్ చేసుకుని మరి వేధిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఎవరినైనా చట్టప్రకారం శిక్షించాలన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు అడ్డుకోవాలనుకుంటే జగన్ చేపట్టిన సంకల్ప యాత్ర చేసేవారా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అరాచకుల చేతుల్లో విలవిల్లాడుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పని తీరు దారుణంగా ఉందని, రాష్ట్రంలో జగన్‌ పాలన దరిద్రంగా తయారైందన్నారు. జగన్ వచ్చే అక్రమ సంపాదనతో ఓటును రూ.10 వేలకు కొంటారని, జగన్‌ను నమ్మి మళ్లీ మోసపోవద్దని చంద్రబాబు సూచించారు.


Similar News