Nellore: అనిల్‌కు ఎదురుదెబ్బలు.. ఆయన చెప్తే తప్పుకుంటా!

నెల్లూరు పార్టీ నేతలతో అనిల్ కుమార్ యాదవ్ అత్మీయ సమావేశం నిర్వహించారు....

Update: 2023-06-23 13:30 GMT

ది, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్‌పై నెల్లూరు నియోజకవర్గంలో తిరుగుబాట్లు వినిపిస్తున్నాయి. సొంత బాబాయ్ రూప్ కుమార్ నుంచి అనిల్‌కు ఇప్పటికే వ్యతిరేకత వ్యక్తమైంది. అనిల్ సొంత మనిషిగా చెప్పుకునే నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ కూడా దూరమయ్యారు. అంతేకాదు నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా అనిల్‌కు ఆహ్వానం అందటం లేదు. వైసీపీ యువజన అధ్యక్షుడిగా మంగళపూడి శ్రీకాంత్ రెడ్డిని నియమించేటప్పుడు కూడా అనిల్ అభిప్రాయం తీసుకులేదు. వైసీపీ ఎంపీలు ఆదాల ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి కూడా అనిల్‌ను దూరం పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలా పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఎమ్మెల్యే అనిల్ పట్ల అసహనంగా ఉన్నారని తెలుస్తోంది. ఏ కార్యక్రమానికి కూడా ఆహ్వానాలు అందకపోవడంతో అటు అనిల్ కూడా దూరంగా ఉంటూ వచ్చారు. ఈ గ్రూపు పొలిటిక్స్ వల్ల ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరనే ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ ప్రచారాన్ని అనిల్ కుమార్ యాదవ్ ఖండించారు. నెల్లూరు పార్టీ నేతలతో అత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ 20 రోజులు బ్రేక్ తీసుకుంటే ఏవేవో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలలే ఉందని తెలిపారు. పెద్ద కుటుంబంగా చెప్పుకునే పేరునే లేకుండా చేశానని, పరోక్షంగా ఆనం రామనారాయణ రెడ్డిని ఉద్దేశించి విమర్శలు చేశారు. జగనన్న ఆదేశిస్తే రాజకీయం నుంచి తప్పుకుంటానని చెప్పారు. ఇద్దరు అనుకుంటే తనను ఓడించలేరని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ హెచ్చరించారు. 

Tags:    

Similar News