రుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే.. సంచలన ట్వీట్ చేసిన వైసీపీ

రుషికొండ భవన నిర్మాణాలపై టీడీపీ నాయకులు చేస్తున్న ప్రచారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది...

Update: 2024-06-16 12:56 GMT

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గతంలో మూడు రాజధానులు ప్రకటించారు. విశాఖ పరిపాలన రాజధాని అంటూ రిషికొండలో పెద్ద భవనాన్ని నిర్మించారు. అయితే అక్రమంగా నిర్మించారంటూ అప్పటి ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. ప్రస్తుతం కూటమి అధికారంలోకి రావడంతో టీడీపీ ఎమ్మెల్మే గంటా శ్రీనివాసరావు రిషికొండ భవనంలోకి వెళ్లారు. అయితే ఆ భవనాన్ని లైవ్‌లో రాష్ట్ర ప్రజలకు చూపించారు. రూ. 500 కోట్ల ప్రభుత్వ సొమ్ముతో జగన్ ప్యాలెస్ నిర్మించుకున్నారని వ్యాఖ్యానించారు.

అయితే టీడీపీ నాయకులు చేస్తున్న విమర్శలకు ట్వీట్టర్ ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అవి ప్రైవేటు ఆస్తులు కాదని, ఎవరి సొంతకాదని తెలిపారు. విశాఖకు గత ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని, అందుకే అలాంటి భవనాలను నిర్మించిందని చెప్పారు. ఇక ఆ భవానాలను ఎలా వినియోగించుకోవాలనేది ప్రభుత్వం ఇష్టమని పేర్కొన్నారు.

‘‘అలాంటి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీయించి, వాటికి వక్రీకరణలకు జోడించి బురదజల్లాలని ప్రయత్నించడం వెనుక ఉద్దేశాలేంటో ప్రజలు గమనిస్తున్నారు. 1995 నుంచి కూడా విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని చంద్రబాబు ఊదరగొడుతూనే ఉన్నారు. ఇప్పటికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. విశాఖ నగరానికి ఒక ప్రధానమంత్రి వచ్చినా, ఒక రాష్ట్రపతి వచ్చినా, ముఖ్యమంత్రి వెళ్లినా, గవర్నర్‌లాంటి వ్యక్తులు వెళ్లినా వారికి ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదన్న విషయాన్ని గుర్తించండి. రుషికొండ రిసార్ట్స్‌ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీసి, పైత్యం ప్రదర్శించడంవల్ల మీకు మానసిక తృప్తి కలుగుతుందేమోగాని, విశాఖపట్నం ప్రజలకు మేలు జరగదు.’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ట్వీట్ చేసింది.


Similar News