సార్ నిన్ను విడిచివెళ్లిపోతుంటే బాధగా ఉందంటూ... కన్నీళ్లు పెట్టుకున్న కోటంరెడ్డి గన్‌మెన్లు
ఏపీలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి, వైసీపీ ప్రభుత్వం మధ్య గత కొద్ది రోజుల రాజకీయ వార్ నడుస్తున్న...Special News
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి, వైసీపీ ప్రభుత్వం మధ్య గత కొద్ది రోజుల నుంచి రాజకీయ వార్ నడుస్తున్న విషయం తెలిసింది. ఇదిలా ఉండగా నేడు కోటంరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేమంటే.. రాష్ట్ర ప్రభుత్వం తనకు భద్రతను తగ్గించిందని, ఇప్పటివరకు ఉన్న 2 ప్లస్ 2గా ఉన్న సెక్యూరిటీని 1 ప్లస్ 1కి తగ్గించిన సర్కార్ కు తానే రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నానని.. అదేమంటే రాష్ట్ర ప్రభుత్వం తనకు ఇద్దరు గన్ మెన్లను తొలగించిందని.. కానీ, మిగిలిన గన్ మెన్లు కూడా తనకొద్దని ఆయన చెప్పారు. గన్ మెన్లను తొలగించినంత మాత్రానా తాను భయపడబోనని అన్నారు. అయితే, గన్ మెన్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో వారిద్దరినీ కోటంరెడ్డి ఓదార్చారు.
READ MORE
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కు భద్రత తగ్గింపు.. కన్నీరు పెట్టుకున్న గన్‌మెన్లు