తుపాను సహాయక చర్యలపై ప్రత్యేక దృష్టి సారించండి: ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ విజ్ఞప్తి

ఏపీపై మిచౌంగ్ తుపాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.

Update: 2023-12-04 14:34 GMT

దిశ,డైనమిక్ బ్యూరో: ఏపీపై మిచౌంగ్ తుపాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. మిచౌంగ్ తుపాను తీవ్ర ప్రభావం చూపించబోతోందని వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసిందని అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. తుపాను ప్రభావం ఉండే ప్రాంతాల్లోని ప్రజలకు అవసరమైన సహాయక చర్యల్లో జనసేన నాయకులు, కార్యకర్తలు పాలుపంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. తుపాను బాధితులకు ఆహారం, ఔషధాలు వంటి అత్యవసర వస్తువులు అందించాలని పవన్ కల్యాణ్ సూచించారు. ఇది పంటలు చేతికి వచ్చే సమయం అని, పంటలు నష్టపోయే అవకాశాలు ఉన్నాయని విచారం వ్యక్తం చేశారు. ప్రకృతి విపత్తులు మిగిల్చే నష్టాలతో రైతాంగం కుదేలైపోతోందని జనసేనాని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్ట పరిహారం లెక్కించడంలో మానవతా దృక్పథంతో అధికారులు వ్యవహరించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. 

Tags:    

Similar News