రూపాయి నాణేలతో "వెంకన్న"..తొలి ఏకాదశికి ప్రత్యేక అలంకరణ

హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి పండుగ తొలి ఏకాదశి.

Update: 2024-07-17 09:14 GMT

దిశ ప్రతినిధి,కాకినాడ:హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి పండుగ తొలి ఏకాదశి. ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రకు ఉపక్రమిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రకు ఉపక్రమిస్తారని పురాణగాథలు చెబుతున్నాయి. బుధవారం నుంచి చాతుర్మాసం ప్రారంభమవుతుంది.

అత్యంత పుణ్య దినం కావడంతో కాకినాడ రూరల్ మండలం చీడిగలో శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక రూపంలో స్వామి దర్శన మిచ్చారు.స్వామివారి మూల విరాట్ ను సుమారు 20 వేల రూపాయి విలువ గల రూపాయి బిళ్ళలతో ప్రత్యేకంగా అలంకరించారు. తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. ఆలయ ప్రాంగణంలో సుదర్శన హోమం నిర్వహించారు. దర్శనార్థం వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు.


Similar News