AP News:పంట నష్టం అంచనాకు ప్రత్యేక యాప్‌

వరద నష్టాలకు సంబంధించిన సమాచారాన్ని రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఏలూరు డివిజన్ లోని తహశీల్దార్లను రెవెన్యూ డివిజనల్ అధికారి ఎన్‌ఎస్ కె.ఖాజావలి ఆదేశించారు.

Update: 2024-09-12 13:43 GMT

దిశ,ఏలూరు: వరద నష్టాలకు సంబంధించిన సమాచారాన్ని రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఏలూరు డివిజన్ లోని తహశీల్దార్లను రెవెన్యూ డివిజనల్ అధికారి ఎన్‌ఎస్ కె.ఖాజావలి ఆదేశించారు. గురువారం పెదపాడు మండలం అప్పనవీడు సచివాలయంలో పంట నష్టాల వివరాలు నమోదు ప్రక్రియను ఆర్డిఓ ఖాజావలి పరిశీలించారు. ఈ సందర్భంగా పంట నష్టం, పశు నష్టం, ఇళ్ల నష్టం, తదితర వాటిపై ఆరా తీశారు. వరదల వల్ల పంట నష్టాన్ని అంచనా వేయడానికి ప్రత్యేక యాప్‌ను ప్రభుత్వం రూపొందించిందన్నారు. వరద మూలంగా జరిగిన నష్టాలు, వరద బాధిత ప్రజల డేటాకు సంబంధించిన అన్ని వివరాలు యాప్‌లో నమోదు చేయబడ్డాయన్నారు. వీరి వెంట తహశీల్దారు డి. ప్రసాద్, తదితరులు ఉన్నారు.


Similar News