‘అప్పుడే ఆమోదించలేం’.. ఆర్కే రాజీనామాపై స్పీకర్ తమ్మినేని కీలక ప్రకటన
వైసీపీ సీనియర్ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తన ఎమ్మెల్యే పదవికి, వైఎస్సార్‌సీపీ పార్టీకి రాజీనామా చేయడం ఏపీ పాలిటిక్స్‌లో సంచలనంగా మారింది.
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ సీనియర్ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తన ఎమ్మెల్యే పదవికి, వైఎస్సార్‌సీపీ పార్టీకి రాజీనామా చేయడం ఏపీ పాలిటిక్స్‌లో సంచలనంగా మారింది. మరి కొన్ని నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ సీనియర్ నేత ఆర్కే రాజీనామా వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఆర్కే రాజీనామాపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా చేశారన్న వార్త తెలిసిందని.. ఓఎస్డీ ద్వారా తనకు సమాచారం అందిందని తెలిపారు. ఆర్కే ఎందుకు రాజీనామా చేశారన్న దాని గురించి నాకు తెలియదని అన్నారు.
రాజీనామాకు గల కారణాలను ఆయనతో పర్సనల్‌గా మాట్లాడి తెలుసుకుంటానన్నారు. రాజీనామా లేఖ ఇచ్చినంత మాత్రాన అది రాజీనామా కింద ఆమోదించలేమని.. ఆ రాజీనామా రాజ్యాంగబద్దంగా ఉందో లేదో చూసేంతవరకు దీనిపై స్పష్టత ఇవ్వలేమని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్కేకు వైసీపీలో సముచిత స్థానం ఇవ్వలేదని.. అందుకే రాజీనామా చేశారని జరుగుతోన్న ప్రచారం అంతా అవాస్తవమని ఈ వార్తలను తమ్మనేని కొట్టి పారేశారు. ఇక, ఆర్కే రాజీనామాపై వైసీపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఏపీ పాలిటిక్స్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.