Breaking: రెబల్ ఎమ్మెల్యేలపై మరోసారి స్పీకర్ నోటీసుల వేటు
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ రెబల్ ఎమ్మెల్యేల అంశం ఉత్కంఠభరితంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. వైస్సీపీ రెబల్ ఎమ్మెల్యేలు రేపు ఉదయం విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశిస్తూ స్పీకర్ మరోసారి నోటీసులు జారీ చేశారు. అలానే రేపు మధ్యాహ్నం విచారణకు హాజరు కావాల్సిందిగా టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ మోహన్, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరికి నోటీసులు ఇచ్చారు. రెబల్ ఎమ్మెల్యేల విచారణకు పిలిచినట్టు పిటిషనర్, టీడీఎల్పీ విప్ స్వామికి ఇంటిమేట్ చేసిన స్పీకర్ పేషీ విచారణ సమయంలో హాజరు కావాలని స్వామికి సూచించారు. అయితే అటు వైసీపీ ఇటు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
గత్తంలోనూ టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు విచారణకు హాజరు కావాల్సిందిగా పిలుపునిచ్చారు. ఇక ప్రస్తుతం ముచ్చటగా మళ్ళీ మూడోసారి విచారణకు రావాల్సిందిగా స్పీకర్ తమ్మినేనిసీతారాం ఆదేశించారు. అలానే వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల అనర్హతపై కూడా ఇప్పటికి మూడుసార్లు విచారణ కొనసాగింది.. ఈ నేపథ్యంలో ఇప్పటికి వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి రెండు సార్లు, అలానే ఒక్కసారి వాసుపల్లి గణేష్, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్పీకర్ ఎదుట హాజరు కాగా.. వల్లభనేని వంశీ మోహన్, కరణం బలరాం, మద్దాలి గిరి అసలు ఇప్పటి వరకు విచారణకు హాజరు కాలేదు. ఇక ఈ నెల 12న విచారణకు రావాలని ఇంతకు ముందు స్పీకర్ నోటీసులు జారీ చేయగా, వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేకపోతున్నామని స్పీకర్‌కు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు లేఖ పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు రేపు స్పీకర్ ఎదుట హాజరు కావాలని అసెంబ్లీ అధికారులు లేఖలు పంపారు.