Alluri District: వాగులో అత్యుత్సాహం.. రక్షించిన స్థానికులు
జోరువానలో కొందరు యువకులు అత్యుత్యాహం ప్రదర్శించారు..
దిశ, వెబ్ డెస్క్: జోరువానలో కొందరు యువకులు అత్యుత్యాహం ప్రదర్శించారు. రోడ్డుపై ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు దాటేందుకు ప్రయత్నం చేశారు. అయితే బెడిసి కొట్టింది. వాగు ఉధృతితో బైక్‌తో సహా చిక్కుకుపోయారు. స్థానికులు రక్షించకుంటే వాగులో కొట్టుకుపోయేవారు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా పెద్దబయలులో జరిగింది. జిల్లాలో కురుస్తున్న వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. చాలా చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. మరికొన్ని చోట్ల వాగులు పొంగడంతో రోడ్లపై నీరు ఉధృతిగా ప్రవహిస్తోంది.
పెద్దబయలులో వాగు ఉప్పొంగి రోడ్డుపై నుంచి ఉధృతిగా ప్రవహిస్తోంది. అయితే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు బైక్‌పై వాగు దాటేందుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వాగు ఉధృతిలో బైక్ జారీ పోయింది. దీంతో ఇద్దరు యువకులు వాగు ఉధృతిలో కొట్టుకు పోయేంత పని జరిగింది. స్థానికులుగమనించి ఇద్దరు యువకులను రక్షించి సురక్షితంగా వాగు ఒడ్డుకు చేర్చారు. బైక్ కాబట్టి కాపాడగలిగారని, అదే కారు అయితే ప్రమాదం జరిగి ఉండేదని పలువురు స్థానికులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వాగులు, వంకలు ప్రవహిస్తున్న సమయంలో దయచేసి కొంత సేపు ఆగి ఉధృతి తగ్గిన తర్వాత ప్రయాణం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Read More..
School Holiday:భారీ వర్షాలు..రేపు స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం