సీతారాం ఏచూరి మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు:సీపీఎం

కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరరావు. సీపీఎం ఉభయ కమ్యూనిస్టు పార్టీ నాయకులు రఘురామ్మూర్తి , జనసేన పార్టీ జిల్లా నాయకులు రామిరెడ్డి , ఎమ్మార్పీఎస్ నాయకులు డా. రాజు లు అన్నారు.

Update: 2024-09-13 10:12 GMT

దిశ,నందికొట్కూరు: కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరరావు. సీపీఎం ఉభయ కమ్యూనిస్టు పార్టీ నాయకులు రఘురామ్మూర్తి , జనసేన పార్టీ జిల్లా నాయకులు రామిరెడ్డి , ఎమ్మార్పీఎస్ నాయకులు డా. రాజు లు అన్నారు. శుక్రవారం పట్టణంలోని జైకిసాన్ పార్కు లో కామ్రేడ్ సీతారాం ఏచూరి సంతాప సభ గోపాలకృష్ణ అధ్యక్షత నిర్వహించారు. సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆశయాల కొరకు పని చేద్దామని నినాదాలు చేశారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీతారాం మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు అని పేర్కొన్నారు. ఏచూరి పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమేనన్నారు.

విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి అడుగుపెట్టి దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా జాతీయ రాజకీయాల్లో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారని తెలిపారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని పేర్కొన్నారు. లౌకికవాదం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం కోసం ఏచూరి నిరంతరం పోరాడారన్నారు. శ్రామికులు, రైతుల కోసం నిరంతరం పోరాటం చేసిన నేత ఏచూరి అని అన్నారు. 12 సంవత్సరాలు పార్లమెంటులో భారత దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు రైతుకార్మిక కర్షకుల సమస్యల పై చర్చించి చట్టాలు చేయడంలో కీలకపాత్ర పోషించాడని 2015లో సీపీఎం పార్టీ ఆల్ ఇండియా కార్యదర్శిగా పనిచేస్తూ ఉభయ కమ్యూనిస్టు ప్రజా సంఘాల బలోపేతం కొరకు ఎంతో కృషి చేశాడని తెలిపారు. నేపాల్ రాజకీయ సంక్షోభంలో ఉన్నప్పుడు కీలకపాత్ర ఆయన పోషించాడన్నారు.

రాష్ట్ర విభజన సందర్భంలో ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరగకుండా ఉండడానికి కీలక పాత్ర పోషించాడని తెలిపారు. ప్రపంచ శాంతి అవార్డు ఇచ్చి ఢిల్లీలో ఆయనను సత్కరించారని నిరంతరం కార్మిక కర్షక కష్టజీవుల సంక్షేమం కోసం ఎనలేని కృషి చేశాడని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం చేయడంలో కీలక పాత్ర పోషించడనీ, సమాచార హక్కు చట్టం కార్మికుల కర్షకుల కొరకు కార్మిక చట్టాలు రైతాంగ చట్టాలు చేయించడంలో ఆయన కీలకపాత్ర పోషించాడని కొనియాడారు. ఆయన ఆశయాలు కొనసాగాలంటే మనమంతా ఐక్య ఉద్యమాలతో ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం ఉభయ కమ్యూనిస్టు పార్టీప్రజా సంఘాల నాయకులు, విద్యార్థి సంఘం నాయకులు వినోద్ శేఖర్ నాయుడు దిలీప్ రాజు హర్షవర్ధన్ సిపిఎం పార్టీ ప్రజాసంఘాల నాయకులు శ్రీనివాసులు, ఓబు లేసు, ఫకీర్ సాహెబ్, ఎం కర్ణ, సాజిదాబి, రంగమ్మ, ఈశ్వరమ్మ, జయరాన్ని, ఆకుల రాము, నరసింహులు, వెంకటేశ్వర్లు, దూదేకుల బాబు, గణేష్, శివ తదితరులు పాల్గొన్నారు.


Similar News