AP News:ఆ ప్రాంతంలో మద్యం దుకాణం వద్దు.. మహిళల ధర్నా

విశాఖ తూర్పు నియోజకవర్గ పరిధిలో 28 వ వార్డు దసపల్ల హిల్స్ దరి పంది మెట్ట ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటు వ్యతిరేకిస్తూ ధర్నా నిర్వహించారు.

Update: 2024-10-26 12:43 GMT

దిశ ప్రతినిధి,విశాఖపట్నం: విశాఖ తూర్పు నియోజకవర్గ పరిధిలో 28 వ వార్డు దసపల్ల హిల్స్ దరి పంది మెట్ట ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటు వ్యతిరేకిస్తూ ధర్నా నిర్వహించారు. ఐద్వా నాయకురాలు కే. మణి ఆద్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం విధానంలో భాగంగా తమ ప్రాంతంలోకి నూతనంగా ఒక మద్యం విక్రయం దుఖానం కొందరు వ్యక్తులు దక్కించు కున్నారు అని తెలిపారు. ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధంగా ఉంది. పూర్తి నివాస గృహాల మధ్య కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం మద్యం దుకాణం వచ్చింది. మరీ ముఖ్యంగా ఈ ప్రాంత ఇలవేల్పు ముత్యాలమ్మ దేవాలయానికి అతి చేరువలో వచ్చింది.

ప్రభుత్వ నిబంధనలు ప్రకారం దేవాలయాలకు వంద మీటర్ల లోపు మద్యం దుకాణం ఉండకూడదు అని ఆమె గుర్తు చేశారు. ఇది ఈ ప్రాంతం మహిళల మాన ప్రాణాలకు మనోభావాలకి సంబంధించిన విషయం అన్నారు. తీవ్ర ప్రతిఘటనతో కొద్ది రోజుల క్రితం మద్యం దుకాణాల నిర్వాహకులు వెనుదిరిగారు అని వారు గుర్తు చేశారు. ఇక మీదట కూడా వీరు ఇక్కడ మద్యం విక్రయించ డానికి వీలు లేకుండా తగు చర్యలు తీసుకోవలసినదిగా కోరారు. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ ధర్నాలో ఐద్వా నాయకురాలు కే. మణి , అధిక సంఖ్యలో స్థానిక మహిళలు పాల్గొన్నారు.


Similar News