AP Government:ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. నవంబర్ 4 వరకు ఆ సేవలు బంద్!

ఏపీ ప్రభుత్వం(AP Government) సంచలన నిర్ణయం తీసుకుంది.

Update: 2024-10-26 13:01 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వం(AP Government) సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా భవన నిర్మాణాలు(Building structures), లేఅవుట్లకు ఆన్‌లైన్‌లో పర్మిషన్లు ఇచ్చే పోర్టల్‌లో ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఈ నేపథ్యంలో నవంబర్ 4 వరకు ఆన్‌లైన్ అనుమతుల సేవలు నిలిపివేసినట్లు DPMS డైరెక్టర్ తెలిపారు. సర్వర్ మైగ్రేషన్‌(Server migration)లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రజెంట్ భవనాల నిర్మణాలు, లేఅవుట్లకు అనుమతులను DPMS వెబ్‌సైట్ ద్వారా జారీ చేస్తున్నారు. వీటికి సంబంధించిన సర్వర్‌తో పాటు డేటా అంతా ప్రైవేట్ సంస్థ అయిన అమెజాన్ వెబ్ సర్వీసెస్‌(Amazon Web Services)లో ఉంది. ఈ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంలోని స్టేట్ డేటా సెంటర్‌కు బదలాయిస్తున్నట్లు తెలిపారు. తిరిగి వెబ్‌సైట్ అందుబాటులోకి రాగానే ప్రజలు, బిల్డర్లు, డెవలపర్లు, ఇంజినీర్లు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

Tags:    

Similar News