వజ్రాల వేట.. పుష్పగిరికి క్యూ కట్టిన జనం

వైఎస్సార్ జిల్లా వల్లూరు మండలంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి ఆలయం పరిసర ప్రాంతాల్లోని భూములు, తిప్పల్లో వజ్రాల కోసం గాలిస్తున్నారు.

Update: 2023-10-04 03:42 GMT

దిశ, కడప ప్రతినిధి: వైఎస్సార్ జిల్లా వల్లూరు మండలంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి ఆలయం పరిసర ప్రాంతాల్లోని భూములు, తిప్పల్లో వజ్రాల కోసం గాలిస్తున్నారు. కొంత మందికి వజ్రాలు దొరికాయన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో మేము సైతం అంటున్నారు. కొండపై ఏదైనా మెరిసే రాయి కనబడితే వాటిని సంచుల్లో వేసుకొని నగల దుకాణాలు వద్దకు తీసుకెళుతున్నారు. వజ్రాలు దొరికితే తమ బతుకులు మారతాయనే ఉద్దేశంతో ఇలా వేట సాగిస్తున్నామని అమాయక ప్రజలు చెబుతున్నారు.

Tags:    

Similar News