తిరుమల లడ్డూ వివాదం.. గత ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేసిన RRR
ఏపీలో తిరుమల లడ్డూ(Tirumala Laddu) ప్రసాదం వివాదం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో తిరుమల లడ్డూ(Tirumala Laddu) ప్రసాదం వివాదం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. తిరుమల లడ్డూ వ్యవహారం పై ఇప్పటికే పలువురు మంత్రులు స్పందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు (Raghuramakrishnam Raja) స్పందించి గత వైసీపీ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారి భక్తులు మనోభావాలు దెబ్బ తీసినందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ను ఆ వేంకటేశ్వర స్వామి వారు ఓడించారని రఘురామకృష్ణంరాజు అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆయన భక్తులను ఎలా దూరం చేయాలనే క్రిమినల్ ఆలోచనలతో గత టీటీడీ బోర్డు (TTD Board) పని చేసిందని ఆరోపించారు. భక్తుల మనోభావాలు దెబ్బ తీయడానికి వైసీపీ నాయకులు తిరుమల లడ్డూ తయారీ విషయంలో ఇంత దారుణానికి తెగించారని విమర్శించారు.
ఈ నేపథ్యంలో లడ్డూల తయారీ కోసం వాడిన పదార్థాలలో జంతువుల కొవ్వు (Animal Fat) ఉన్నట్లు పరీక్షల్లో తేలిందని, ఇది కావాలని టీడీపీ నాయకులు (TDP Leaders) కానీ, సీఎం చంద్రబాబు (CM Chandrababu) చేస్తున్న ఆరోపణలు కాదని ఆయన అన్నారు. శ్రీవారి భక్తుల (Devotees) మనోభావాలు దెబ్బతింటాయి అని తెలిసినా కూడా సీఎం చంద్రబాబు నాయుడు తప్పని పరిస్థితుల్లో ఈ విషయం బయట పెట్టాల్సి వచ్చిందని చెప్పారు. తిరుమలలో భక్తులకు ఉచితంగా మంచినీరు సీసాలు అందించాలని, భక్తులు బస చేసే గదుల ధరలు తగ్గించాలని రఘురామకృష్ణంరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు. తిరుమల కొండపై భక్తుల సౌకర్యాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.