బావ కళ్లలో ఆనందం కాదు.. భక్తుల కళ్లల్లో ఆనందం చూడు: పురందేశ్వరిపై రోజా హాట్ కామెంట్స్

బావ కళ్లలో ఆనందం కాదు.. భక్తుల కళ్లలో ఆనందం చూడాలంటూ ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeshwari)ని ఉద్దేశించి మాజీ మంత్రి రోజా (Former Mister Roja) హాట్ కామెంట్స్ చేశారు.

Update: 2024-10-02 06:30 GMT
బావ కళ్లలో ఆనందం కాదు.. భక్తుల కళ్లల్లో ఆనందం చూడు: పురందేశ్వరిపై రోజా హాట్ కామెంట్స్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: బావ కళ్లలో ఆనందం కాదు.. భక్తుల కళ్లలో ఆనందం చూడాలంటూ ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeshwari)ని ఉద్దేశించి మాజీ మంత్రి రోజా (Former Mister Roja) హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై ఆమె మరోసారి ఫైర్ అయ్యారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court) వ్యాఖ్యలను కూడా పురందేశ్వరి (Purandeshwari) తప్పదోవ పట్టించారని ఆరోపించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) చేసిన వ్యాఖ్యలను సుప్రీం కోర్టు తీవ్రంగా పరిగణించిందని గుర్తు చేశారు. ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడినట్లుగా ఆధారాలు ఉన్నాయా అని కోర్టు అడగ్గా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేదని ఎద్దేవా చేశారు. కల్తీ జరగనప్పుడు ఎందుకు బహిరంగ ప్రకటన చేశారంటూ ప్రశ్నించగా సీఎం చంద్రబాబు (CM Chandrababu) కోర్టుకు అడ్డంగా దొరికిపోయారని ఆరోపించారు. బావ కళ్లలో ఆనందం కాదు.. భక్తుల కళ్లల్లో చూడాలని రోజా, పురందేశ్వరిపై ఫైర్ అయ్యారు.

కాగా, శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) కు వచ్చిన సమాచారం మేరకే ప్రకటన చేశారని ఇటీవల ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeshwari) కామెంట్ చేశారు. నెయ్యి కల్తీపై అధికారులతో పూర్తిగా సమీక్ష నిర్వహించాకే తిరుమల లడ్డూ విషయంపై సీఎం మీడియాతో మాట్లాడి ఉంటారని అన్నారు. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఎలా అమలవుతున్నాయనే విషయాలను కోర్టు కూడా పరిగణలోకి తీసుకుంటుందని ఆమె కామెంట్ చేశారు. అయితే, లడ్డూ కల్తీ విషయంలో సీఎం స్టేట్‌మెంట్‌ను పురందేశ్వరి సమర్ధించడం పట్ల రోజా ఆమెకు కౌంటర్ ఇచ్చారు.

Tags:    

Similar News