భారీ వర్షాలు..పొంగిన వాగులు, వంకలు

శనివారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగుతున్నాయి.

Update: 2024-09-01 12:25 GMT

దిశ,పాణ్యం:శనివారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగుతున్నాయి. గగ్గుటూరు టీడీపీ నాయకులు మోహన్ రెడ్డి మాట్లాడుతూ..పాణ్యం మండలం గగ్గుటూరు గ్రామంలోని ఊరి ముందరి మునుకుందు వంక ఎక్కువగా ప్రవహించడం వలన గ్రామ ప్రజలు పొలాలకు పోవడానికి మరియు పక్క గ్రామాలైన రాయపాడు నుంచి గగ్గటూరు మీదుగా ప్రముఖ శ్రీ వల్లి దేవసేన సుబ్బరాయుని కొత్తూరు దేవస్థానం పోవుటకు ఈ రహదారి గుండనే రాకపోకలు కొనసాగించాలి.

పొలాలకు వెళ్లిన రైతులు మరియు పాఠశాలలకు వెళ్లిన విద్యార్థులు తిరుగు ప్రయాణంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అంతేకాకుండా వాగు సమీపంలో గల పంట పొలాల్లోకి నీరు రావడంతో పంట నీట మునిగి రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రయాణానికి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి గగ్గటూరు గ్రామాలకు రాకపోకలు జరగడానికి ఒక బ్రిడ్జి నిర్మించాలని గ్రామ ప్రజలు కోరడమైనది. శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని వాగులు వంకలు పొంగుతున్నాయని గ్రామ నాయకుడు మోహన్ రెడ్డి తెలిపారు.


Similar News