బీ అలర్ట్ : నేడు బయటకు రావద్దు
ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఎండలు దంచి కొడుతున్న విషయం తెలిసిందే. కాగా, మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో, భానుడు తన ప్రతాపం చూపెట్టనున్నాడని వాతావరణ శాఖ తెలిపింది.
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఎండలు దంచి కొడుతున్న విషయం తెలిసిందే. కాగా, మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో, భానుడు తన ప్రతాపం చూపెట్టనున్నాడని వాతావరణ శాఖ తెలిపింది. నేడు గుంటూరు, దుగ్గిరాల, కొల్లిపర,మంగళగిరి, పెద్దకాకాని, తాడేపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, ఇబ్రహీపట్నంలో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.1954 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని, అందువలన బాలింతలు, గర్భిణీలు, వృద్ధులు, చిన్న పిల్లలు బయటకు రాకూడదంటూ తెలలిపింది. అత్యవసర సమయాల్లో 1070 లేదా 18004250101కు కాల్ చేయాలని అధికారులు సూచించారు.