AP:కౌలు రైతుల రుణాలపై సమీక్ష.. మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు

రాష్ట్రంలో రైతులు, డ్వాక్రా సంఘాలకు సహా వివిధ వర్గాలకు బ్యాంకర్లు అందించాల్సిన రుణాలపై రాష్ట్ర వ్యవసాయ, సహకార మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు.

Update: 2024-10-17 11:08 GMT

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రైతులు, డ్వాక్రా సంఘాలకు సహా వివిధ వర్గాలకు బ్యాంకర్లు అందించాల్సిన రుణాలపై రాష్ట్ర వ్యవసాయ, సహకార మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. నేడు(గురువారం) అమరావతిలోని సచివాలయం 5వ బ్లాక్‌లో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర స్థాయి బ్యాంకర్లు, నాబార్డు అధికారులతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇక ప్రభుత్వం ప్రకటిస్తున్న పాలసీలకు బ్యాంకర్ల సహకారం అవసరమని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు.

ఈ క్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. 228వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశానికి ప్రత్యేకత ఉందన్నారు. ఏపీకి అన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను చిన్నాభిన్నం చేసి ఆర్థిక వ్యవస్థని నాశనం చేసిందని ఆరోపించారు. గత ఐదేళ్లలో ఆగిపోయిన సంక్షేమం, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా పని చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. సుదీర్ఘమైన తీర ప్రాంతం, కష్టపడి పని చేసే యువత ఏపీకి ఉన్న అదృష్టం అని అన్నారు. ప్రధాని అత్యంత అద్భుతమైన స్కీంలు పెట్టి బ్యాంకులకు టార్గెట్లు ఇస్తున్నారని చెప్పారు. కానీ బ్యాంకులు ఆ టార్గెట్లు పూర్తి చేయకుండా ఇలా సమావేశాలు పెట్టుకోవడమే సరిపోతుంది అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.


Similar News