ఆ బీచ్‌లో అల్లకల్లోలం.. వంద మీటర్లు ముందుకొచ్చిన సముద్రం

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం తీర ప్రాంతంలో తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది.

Update: 2024-10-17 11:54 GMT

దిశ, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం తీర ప్రాంతంలో తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌లో సముద్రం సుమారు 100మీటర్ల మేర ముందుకు చొచ్చుకు వచ్చింది. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇటు చిన్నమైనవాని లంక, పెదమైనవాని లంక, కెపి పాలెం గ్రామాల వద్ద సముద్రం ముందుకు చొచ్చుకు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రభుత్వ హెచ్చరికతో సముద్రంలో వేటకు వెళ్లిన బోట్లన్నీ తీరానికి చేరుకున్నాయి.


Similar News