ఆ రోజు నేను లేను.. అయినా వేధిస్తున్నారు: సజ్జల సంచలన వ్యాఖ్యలు

మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన రోజు తాను లేనని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు..

Update: 2024-10-17 11:29 GMT

దిశ, వెబ్ డెస్క్: మంగళగిరి టీడీపీ కార్యాలయం(Mangalagiri TDP Office)పై దాడి జరిగిన రోజు తాను లేనని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి(YCP leader Sajjala Ramakrishna Reddy) తెలిపారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో విచారణకు హాజరైన ఆయన అడిగిన ప్రశ్నలే పోలీసులు మళ్లీ అడిగారని తెలిపారు. తమ నేతలపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని పేర్కొన్నారు. కేవలం వైసీపీ(YCP) నేతలను మాత్రమే టార్గెట్ చేశారని ఆరోపించారు. వైసీపీ నాయకులను భయపెట్టాలని చూస్తున్నారని, రాష్ట్రంలో ప్రతిపక్షమనేది లేకుండా చేయాలని టీడీపీ నాయకులు చూస్తున్నారని సజ్జల వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలను తెలుగుదేశం పార్టీ గాలికి వదిలేసిందని విమర్శించారు.ఇప్పటికైనా టీడీపీ(TDP) కక్ష సాధింపులు మానుకోవాలని సూచించారు.

కాగా మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డిపై అభియోగాలుండటంతో ఆయన్ను పోలీసులు 120వ నిందితుడిగా చేర్చారు. విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో జరిగిన విచారణకు గురువారం సజ్జల హాజరయ్యారు. దీంతో గంటన్నర పాటు ఆయనను పోలీసులు విచారించారు. అనంతరం బయటకు పంపారు. మరోసారి సైతం విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని సజ్జలకు సూచించినట్లు తెలుస్తోంది. 


Similar News